18-12-2025 10:12:03 AM
హైదరాబాద్: కాటేదార్ పరిధిలో రౌడీషీటర్ పై దాడి జరిగింది. వట్టెపల్లి మలుపు వద్ద అర్ధరాత్రి సోహెల్ అనే రౌడీషీటర్ ను మరో రౌడీషీటర్, అతన అనుచరులు కలిసి పదునైన కత్తులతో దాడికి చేసి పారిపోయ్యారు. ఈ ఘటనలో సోహెల్ కు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో ఉన్న అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించాడంతో ఘటనా స్థలానికి చేరుకొని హుటహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితునికి చికిత్స అందించిన వైద్యులు అతని పరిస్థితి విషయంగా ఉందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.