ముడిచమురు ధరల భారీ పతనం: భారత్‌కు భారీ ఊరట… ద్రవ్యోల్బణం తగ్గేనా?
ధరల తిరోగమనంతో తగ్గనున్న భారత్ ఒత్తిళ్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: అమెరికా-ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ప్రకటన ముడిచమురు ధరలు భారీగా తగ్గేందుకు కారణమైంది. బుధవారం ప్రకటన వెలువడగానే ముడిచమురు ధరలు ఒక్కసారిగా 13 నుంచి 15 శాతానికిపైగా పడిపోయాయి. బ్రెంట్ ధరలు బ్యారెల్‌కు 94-95 డాలర్ల వద్దకు చేరాయి. హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందనే అంచనాల వల్ల ఒక్కసారిగా రవాణాపై ఉన్న ఆందోళనలు తగ్గాయి.
తాజా బ్రేకింగ్ న్యూస్ కోసం మా Vijayakranthi News హోమ్‌పేజీని సందర్శించండి.
ముడిసరుకులు తగ్గుతాయనే అంచనాలతో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ సంస్థల షేర్ల లో పెరుగుదల నమోదైంది. దేశంలో వినియోగించే చమురులో దాదాపు 90 శాతం దిగుమతి చేసుకునే భారత్‌కు ధరల తిరోగమనం ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను తగ్గించడంలో కీలకం కానుంది. చమురు ధరలు ఆరేళ్లలో అత్యంత తీవ్రంగా పడిపోయాయని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది.
ఇలాంటి అంతర్జాతీయ యుద్ధ వార్తలపై మరిన్ని అప్డేట్స్ కోసం మా National News చూడండి.






