9 April, 2026 | 2:22 AM

సెలూన్ షాప్‌కు 72 లక్షల జీఎస్టీ

09-04-2026 12:25 AM

లబోదిబోమంటున్న నిర్వాహకుడు

అమరావతి, ఏప్రిల్ 8: చిన్నపాటి సెలూన్ షాప్ నిర్వహించుకుంటున్న యాజమానికి రూ. 72 లక్షల జీఎస్టీ చెల్లించాలని అధి కారులు నోటీసులు జారీ చేశారు. నోటీసు చూసిన సెలూన్ షాప్ యాజమాని పైడాడ శ్రీనివాసరావు నిర్ఘాంతపోయాడు. విజయవాడ పంజా సెంటర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. శ్రీనివాసరావు వెంటనే బ్యాంకు కు వెళ్లి ఆరా తీశాడు. జీఎస్టీ అధికారుల ఆదేశాల మేరకు ఖాతాను హోల్డ్‌లో పెట్టామని అధికారులు తెలిపారు.

నోటీసుల్లో విశాఖపట్నంలో స్క్రాప్ ఐరన్ వ్యాపారం జరుపుతు న్నట్లు పేర్కొన్నారు. తనకు అలాంటి వ్యాపారమే లేదని బ్యాంకు అధికారులకు వివరిం చినా తామేమీ చేయలేమని జీఎస్టీ అధికారులనే కలవాలని శ్రీనివాసరావుకు సలహా ఇచ్చారు. కాగా శ్రీనివాసరావుకు తెలియకుండానే ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత పత్రా లను తస్కరించి కొందరు వాటితో దొంగ వ్యాపారాలు చేస్తూ ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు.

ఏదేమైనా జీఎస్టీ నోటీసులతో, బ్యాంకు ఖాతా నిలిచిపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అందుకోలేకపోతున్నానని బాధితుడు వాపోయా డు. నోటీసు పంపిన లావాదేవీల్లో ఉన్న వ్యాపారాలు తనవి కావని నిరూపించుకునేందుకు శ్రీనివాసరావు జీఎస్టీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.