26 August, 2026 | 3:45 PM

అభిలాష వొకేషనల్ సెంటర్‌లో డైనింగ్ ఏరియా షెడ్ ప్రారంభోత్సవం

26-08-2026 02:54 PM

రామచంద్రపురం ఆగస్టు 26: రామచంద్రపురం మండలం భారతీ నగర్ డివిజన్ బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లోని అభిలాష వొకేషనల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన నూతన డైనింగ్ ఏరియా షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి  హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీహెచ్ఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  వై. శ్రీనివాస రావు, లేడీస్ వెల్ఫేర్ సెంటర్ అధ్యక్షురాలు  వై. శ్రీదేవి, అభిలాష వొకేషనల్ సెంటర్ సిబ్బంది, లేడీస్ వెల్ఫేర్ సెంటర్ సభ్యులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

అభిలాష వొకేషనల్ సెంటర్‌లోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు డైనింగ్ ఏరియా షెడ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని సింధు ఆదర్శ్ రెడ్డి పేర్కొన్నారు. పిల్లల సంక్షేమం కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆమె అభినందనలు తెలిపారు.