మిలాద్ ఉన్ నబీ వేడుకలు
26-08-2026 03:00 PM
చెన్నూర్, (విజయక్రాంతి): మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐబీ చౌరస్తా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రవక్తను కీర్తిస్తూ ర్యాలీ నిర్వహించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.






