13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

కల్ట్.. స్లాషర్ ఫిల్మ్!

20-02-2026 01:51 AM

విశ్వక్‌సేన్ మరో కొత్త ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాలతో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆకట్టుకున్న విశ్వక్.. ఇప్పుడు తన స్వీయ రచనాదర్శకత్వంలో కొత్త సినిమాతో రాబోతున్నారు. ‘కల్ట్’ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని తారక్ సినిమాస్ బ్యా నర్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. భారతదేశంలో తొలి స్లాషర్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్‌లో ఇప్పటివరకు చూడని కొత్త ప్రయత్నంగా నిలవనుంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఈ మూవీ టీజర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు. తాజా పోస్టర్‌లో విశ్వక్‌సేన్ వైలెంట్, స్టైలిష్, బోల్డ్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, యజ్ఞ తుర్లపాటి, కబీర్ భారతీయ, విశాక్ నాయర్, చేపూరి వివేక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హీరో విశ్వక్.. ఈ సినిమాతో 40 మంది కొత్త నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుండటం విశేషం. తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని అర్వింద్ విశ్వనాథన్, ఎడిటింగ్‌ను రవితేజ గిరిజాల, ప్రొడక్షన్ డిజైన్‌ను అర్వింద్ ములే నిర్వర్తిస్తున్నారు.