13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

రాజా శివాజీ వస్తున్నాడు!

20-02-2026 01:53 AM

ఛత్రపతి శి వాజీ మహారాజ్ వీరగాథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు నటుడు రితేశ్ దేశ్‌ముఖ్. ‘రాజా శివాజీ’ టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరాఠా సామ్రాజ్య స్థాపన, స్వరాజ్యం కోసం శివాజీ చేసిన పోరాటాలను ఇందులో చూపించబోతున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిస్తున్న రితేశ్ ఇందులో హీరోగానే కా కుండా, ఆయనే ఈ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని రితేశ్ భార్య, నటి జెనీలియా జియో స్టూడియోస్, ముంబై ఫిల్మ్ కంపెనీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇదే ఏడాది వేసవి కానుకగా మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరాఠీతోపాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. గురువారం శివాజీ జయంతిని పురస్కరించుకుని ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. రిలీజ్ డేట్‌ను సైతం అధికారికంగా ప్రకటించారు. ఒక చేతిలో తల్వార్, మరో చేతిలో కాషాయ జెండా పట్టుకుని యుద్ధానికి సిద్ధమైన ఛత్రపతి శివాజీ పాత్రలో ఉన్న రితేశ్ లుక్ తాజా పోస్టర్‌లో ఆకట్టుకుంటోంది.