calender_icon.png 31 January, 2026 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేంద్రియశక్తిని పెంచితేనే సాగుబాగు

18-09-2024 12:00:00 AM

వసాయ నేలల్లో సేంద్రియ కర్బన స్థాయిలను తక్షణం పెంచుకోవలసిన అవసరం చాలా కనిపిస్తున్నదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మొ క్కలు కిరణజన్య సంయోగక్రియ సమయంలో కార్బన్ డై ఆక్సయిడ్‌ని గ్రహించి, దానిని సేంద్రీయ పదార్థంగా మారుస్తా యి. ఇది కుళ్ళిన తర్వాత మట్టిలో కలిసి పోతుంది. నేలలో సేంద్రియ పదార్థాలు పెంపొందించే పద్ధతులను ఎంత ఎక్కువ గా అవలంబిస్తే నేల సారానికి అంత మే లు. కవర్ పంటలు, పంట మార్పిడి, పప్పు ధాన్యాల సాగు, కంపోస్ట్ లేదా పేడ వంటి సేంద్రియ సవరణలను జోడించడం ద్వారా, రైతులు కార్బన్ సీక్వెస్ట్రేషన్‌కు చురుకుగా దోహదపడవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ప్రక్రియలవల్ల మరోవైపు వాతావరణ మార్పులనూ తగ్గించవచ్చునని వారు  చెబుతున్నారు.

నేల ఆరోగ్యం, సంతానోత్పత్తికి సేంద్రి య కర్బనం  ఒక ముఖ్యమైన భాగం. ఇది నేల నిర్మాణం, నీటిని నిలుపుకునే సామ ర్థ్యం, పోషకాల లభ్యతను, సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగు పరుస్తుంది. అధిక సేంద్రియ కర్బనం కంటెంట్ ఉన్న ఆరోగ్యకరమైన నేలలవల్ల అనేక లాభాలు ఉంటాయి. కరువు, భారీ వర్షపాతం వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు మరింత స్థితిస్థాపకత లభిస్తుంది. ఎందుకంటే, అవి తేమను బాగా నిలుపుకుం టాయి. పోషకాల లీచింగ్‌ను తట్టుకోగలవు. ఇది క్రమంగా, పంట ఉత్పాదకతను కొనసాగించడంలో సహాయ పడుతుంది. వాతావరణ వైవిధ్యానికి కలిగే హానినీ నివారిస్తుంది. 

శాస్త్రవేత్తల ఆందోళన

అధిక సేంద్రియ కర్బనం స్థాయిలు కలిగిన నేలలు మెరుగైన నిర్మాణం, స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఇది గాలి, నీటిద్వారా నే ల కోతను తగ్గిస్తుంది. సేంద్రియ పదార్థం ఒక బైండర్‌గా పనిచేస్తుంది. నేల కణాలను ఒక దానితో ఒకటి పట్టుకొని వాటి నిర్లిప్తత, రవాణాను నిరోధిస్తుంది. సేంద్రియ కర్బనం రూట్ జోన్‌లో పోషకాలను నిలుపుకోవడంలో దోహద పడుతుంది. పోషకాల ప్రవాహ నష్టాన్ని నివారిస్తుంది. మొక్కల పోషక- వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా నీటి వనరులు పోషక కాలుష్యానికి గురయ్యే చోట్ల ఇది మరింత తప్పనిసరి, లేకపోతే పర్యవసానాలు మరింత తీవ్రం కాగలవని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత 70 ఏళ్ల క్రితం వ్యవసాయ భూములలో 1 శాతం ఉన్న సేంద్రియ కర్బనం ఇ ప్పుడు 70 శాతం క్షీణతతో 0.3 శాతానికి దిగజారింది. భూములలో సేంద్రియ కర్బ నం పెంచకపోతే ప్రపంచ ఆహార భద్రతకు, పోషకాహారానికి రాబోయే రోజులల్లో  పెనుముప్పు పొంచి వున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధిక సేంద్రియ కార్బన్ కంటెంట్ ఉన్న నేలలు మరింత సారవంతమైన ఉత్పాదకతను కలిగి ఉంటాయి. అవి మంచినీటిని శుద్ధి చేయగలవు. వాతావరణ మార్పుల ప్రభావాలకు జీవనోపాధి స్థితిస్థాపకతను పెంచడంలో సహాయపడతాయి.  ‘ఐక్యరాజ్య సమితి ఎజెం డాద్వారా స్థాపితమైన అనేక అంతర్జాతీయ అభివృద్ధి లక్ష్యాలను, ముఖ్యంగా ఆకలి, పోషకాహార లోపాల నిర్మూలన వంటివాటి సాధనకు ఇది అత్యావశ్యకం. 

కాలుష్యాల కట్టడి కోసమైనా..

భూమిపై మూడింట ఒక వంతు నే ల లు క్షీణించాయి. ఇది ప్రపంచ నేల సేంద్రి య కార్బన్ నిల్వలలో అపారమైన తగ్గుదలకు దారితీస్తుంది. వాతావరణంలోకి సు మారు 100 గిగాటన్నుల వరకు విడుదలైంది. పేలవమైన నేల నిర్వహణ ద్వారా నేల కార్బన్ నిల్వలకు మరింత నష్టం జరుగుతున్నది. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుద లను పరిమితం చేసే ప్రయత్నాలకు ఆటం కం కలిగిస్తుంది. సేంద్రియ శక్తిని పెం చుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, వర దలు, కరువులు ఇతర వాతావరణ మా ర్పు ప్రభావాలను నివారించుకోవచ్చు.

పర్యావరణ వ్యవస్థ అంటే భౌతిక వ్యవస్థ లే దా జీవక్రియలకు అస్థిరత, అసమానత, హాని లేదా అసౌకర్యం కలిగించే విధంగా కలుషితాలను పర్యావరణంలోకి విడుదల చెయ్యటాన్ని ‘కాలుష్యం’ అం టాం. ‘జాతీ య మట్టి సర్వే భూ వినియోగ ప్రణాళిక సంస్థ’ వారు  స్థానిక సాగుభూముల తీరుతెన్నులు, వాతావరణ పరిస్థి తు లనుబట్టి ఏయే పంటలు సాగు చేసుకుం టే ఫలితం బాగుంటుందో సూచనలు ఇ చ్చారు. ఈ మధ్య వారు ప్రచురించిన ఒక నివేదికలో  తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటినట్టు వె ల్లడైంది.

కనుక, ఇప్పటికైనా ప్రభుత్వాలు, రైతులు జాగ్రత్త పడి సేంద్రియ కర్బనాన్ని కనీసం 0.7 మే రకైనా పెంచుకోవాలి. లేకపోతే భూములు పూర్తిగా సాగు యోగ్యం కాకుండా పోయే ప్రమాదం ఉన్నట్లు నివేదికలో నిపుణులు హెచ్చరించారు. భూ మిని నమ్ముకోవడం అంటేనే పంట భూ ములు ప్రకృతి, సేంద్రి య వ్యవసాయం చేస్తూ సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకోవడంగా భావించా లి. భూమి ఆరోగ్యానికి సేంద్రియ కర్బనం ఒక ముఖ్య సూచిక. 

అసాధ్యమేమీ కాదు

మన భూముల్లో 0.5 % కన్నా సేం ద్రియ కర్బనాన్ని పెంపొందించడం కష్టసాధ్యమని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నా రు. అయితే, రసాయనిక ఎరువులకు పూర్తి గా స్వస్తి పలికి ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్న కొందరు రైతులు మాత్రం 2.0% వరకు పెంచుకోవడం సాధ్యమేనని నిరూపిస్తున్నారు. త క్కువ ఖర్చుతో, స్వల్ప కాలంలోనే సేంద్రి య కర్బనాన్ని పెంచుకునే అనేక మార్గాలున్నాయనీ వారు సూచిస్తున్నారు.

శ్రమ తక్కువ ఫలితం ఎక్కువగా ఉండాలని రై తులు భయంకరమైన గడ్డి మందుల వినియోగం చేపడుతుండడం తీవ్ర దుష్ఫలి తాలను ఇస్తున్నది. కలుపు మొక్కల నివారణకు కూలీలు దొరకడం లేదు కూడా. ఎక్కువ కూలీ అడగడంతో గిట్టుబాటు కాక సంవత్సరం వరకు కలుపు రాకుండా ఉం డడానికి గడ్డి, తుంగ, పార్థీనియం, పూల గడ్డి, గారభ తదితర నివారణ పద్ధతులు అవలంభిస్తున్నారు. దీనికి ప్రత్యామ్న్యాయం లేక భూమి నిస్సారమవుతు న్నది. బాగు పడతానేమో అనే మూర్ఖపు పట్టుదలతో రైతులు ఉన్నారు. 

వేల సంవత్సరాలు భూమి నమ్ముకొని పంటలు సాగు చేశారు మన పూర్వీకులు. భూసారం తగ్గకుండా చాలా పద్ధతులు అవలంభించారు. అయితే, మన రైతులు భూమి ఆరోగ్యాన్ని మరచిపోయి 50 సంవత్సరాలు దాటింది. 1966 నుంచి అధిక దిగుబడి వంగడాలు, రసాయనిక ఎరువులపై, వీలుంటే నీటి పారుదల మీద అత్యంత శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నారు. ఈ కాలంలో భూసారం కాలక్రమేణా తగ్గింది. అది ప్రస్తుతం ఏ స్థాయికి చేరిందంటే అస లు భూమి పంటలు పండించే శక్తిని పూర్తి గా కోల్పోయే స్థితికి చేరింది. 95% భూ ముల్లో అతి తక్కువ సేంద్రియ కర్బనం ఉంది.

నేల నమూనాలలో 95 శాతం పైగా సేంద్రియ కర్బనం 0.5% కంటే తక్కువని తేలింది. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని కొన్ని ప్రాంతాలు వర్షాధారపు భూముల్లో 0.1 శాతం వరకు పడిపోయినట్లు నివేదికల్లో నమోదయింది. వ్యవసాయ విశ్వవిద్యాల య క్షేత్రాలలో కూడా 0.1 నుంచి 0.5 % వరకు ఉన్నట్లు నేల పరీక్షా ఫలితాలు ని రూపించాయి. పశువుల ఎరువులు, ఇతర సేంద్రియ ఎరువులు వాడక పోవడం, కేవలం రసాయనిక ఎరువులకే పరిమితం కావడం వంటి చర్యలు ఈ దుస్థితికి ప్రధాన కారణం.

అందరి బాధ్యత

దేశవ్యాప్తంగా సారవంతమైన భూమి విస్తీర్ణం ఏటికేడాది తగ్గిపోతున్నది. దేశంలో మొత్తం 32.87 కోట్ల చదరపు హెక్టార్ల భూ మి ఉండగా, ఇందులో దాదాపు 10.51 కో ట్ల చదరపు హెక్టార్ల భూమి సారం క్షీణించింది. 2030 నాటికల్లా ఈ భూసార క్షీణ తకు అడ్డుకట్ట వేస్తామని భారత్ ఐరాస (ఐక్యరాజ్యసమితి)కు హామీ అయితే ఇచ్చింది. కానీ, నేటికీ పరిస్థితిలో మార్పు లేదు. సరికదా, ఎడారిలా మారుతున్న ప్రాంతాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఒక అం చనా ప్రకారం 2003-05, 2011-13, 2017-2019, 2021--23 మధ్యకాలాలలోనే 49 లక్షల చదరపు హెక్టార్ల భూమి ఎడారిగా మారిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి, ఇప్పటికైనా నేలకు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే సేంద్రియ శక్తిని పెంచుకోవడానికి ప్రభుత్వాలు సహా రైతులు, శాస్త్రవేత్తలు అందరం తక్షణం కంకణబద్ధులం కావాలి.  

-- డా. ముచ్చుకోట సురేష్ బాబు

వ్యాసకర్త సెల్: 9989988912