calender_icon.png 31 January, 2026 | 12:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ సర్పంచ్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సాయం

31-01-2026 10:54:16 AM

భిక్కనూర్, జనవరి 31(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బాగిర్తిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ నాగలక్ష్మి భర్త స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పందించారు. బాధిత కుటుంబానికి రూ.15 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. శనివారం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అత్తిలి శ్రీనివాస్ నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గుడిసె యాదగిరి తదితరులు పాల్గొన్నారు.