31-01-2026 12:00:20 PM
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం(GHMC Council meeting) ప్రారంభమైంది. చంపా పేట్ కార్పొరేటర్ మధుసూదన్ అకాల మరణం పట్ల కౌన్సిల్ సంతాపం తెలిపింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ 2026-27బడ్జెట్(GHMC Council 2026-27 Budget)కు ఆమోదం తెలపనుంది. జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో రూ. 11,460 కోట్లతో మెగా బడ్జెట్ రూపొందించారు. గతంలో జీహెచ్ఎంసీకి రూ. 9,200 కోట్ల బడ్జెట్. కొత్తగా విలీనమైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రూ, 2,260 కోట్ల బడ్జెట్ కు ప్రతిపాదించారు.
12 జోన్లు, 60 సర్కిల్స్, 300 వార్డులు దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ రూపకల్పన చేశారు. అభివృద్ధి పనులకు జరిపిన కేటాయింపులు, ఆదాయ వ్యయాలపై చర్చించనున్నారు. కౌన్సిల్ మీటింగ్ కు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియా సభ్యులు హజరుకానున్నారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలన మండలికి ఇదే ఆఖరి కౌన్సిల్ సమావేశం. ఫిబ్రవరి 10తో ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగియనుంది.