31-01-2026 12:39:39 PM
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలపై(Municipal Elections) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం(Revanth Reddy Zoom meeting) నిర్వహించారు. అమెరికా నుంచే మున్సిపల్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్మాత్మకంగా తీసుకోవాలని సీఎం చూసించారు. అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. సమతుల్యత, గెలుపు, విధేయతలను ఎంపిక చేయ్యాలని ఆదేశించారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండలని తెలిపారు. పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
ప్రతి డివిజన్, ప్రతి వార్డు గెలుపు మనకు ముఖ్యమే అన్నారు. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, మంత్రులు మధ్య అంతరం లేకుండా చూడాలని తెలిపారు. రెబెల్స్ విషయంలో మాట్లాడి సమన్వయం చేసుకోవాలన్నారు. సమష్టిగా పని చేస్తే విజయం సాధిస్తామని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు(Jubilee Hills by-election) రుజువు చేశాయని రేవంత్ గుర్తుచేశారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లో కలిసి పనిచేసి విజయం సాధించామన్న ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నాయకులు అంతా కలిసి పని చేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
చైర్మన్, మేయర్‌లను ఇప్పుడే ప్రకటించొద్దని ఆయన సామాజిక సమీకరణాల ప్రకారం చైర్మన్‌లను ఎంపిక చేయాల్సి ఉంటుందని సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని సీఎం హెచ్చరించారు. కార్పొరేషన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సూచించారు. సర్వేలతో పాటు ఎమ్మెల్యే ల రిపోర్టు తీసుకోవాలన్నారు. సమీక్ష జరగని పార్లమెంట్ సెగ్మెంట్లలో వెంటనే చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అమెరికా నుంచి రాగానే పీఏసీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జూమ్ మీటింగ్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్, భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.