31-01-2026 10:56:24 AM
గాలింపు చర్యలు చేపట్టిన ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం
జడ్చర్ల : జడ్చర్ల మండలంలోని నాగసాల గ్రామ సమీపంలో గల చెరువులో వ్యక్తి గల్లంతు కావడం జరిగింది. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపట మండలంలో గల హనుమాన్ తండా గ్రామపంచాయతీ మాడిచెట్టు తాండ కు చెందిన రమేష్ నాయక్, మూడవత్ రమేష్ నాయక్ అనే ఇద్దరు వ్యక్తులు ఇనుముతో తయారుచేసిన వినాయక పీటలను బయటకు తీసి అట్టి ఇనుమును విక్రయించేందుకు ప్రయత్నించారు. ఆ సందర్భంలో చెరువులో వెతకడం కొనసాగించారు.
రమేష్ నాయక్ అనే వ్యక్తి నీటిలో మునిగి వెతికేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో నీటిలో గల్లంతయ్యాడని సదరు వ్యక్తి మూడవత్ రమేష్ నాయక్ తమ బంధువులకు చరవాణి ద్వారా తెలియజేశారు. బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు చేపట్టిన వారిలో రాజేంద్రనాయక్ ఎస్ఎఫ్ఓ, రాఘవేందర్ రెడ్డి ఎల్ ఎఫ్ ఓ, రామచంద్రయ్య డీఓపి, ఆంజనేయులు ఎఫ్ ఎఫ్, ముకుందం ఎఫ్ ఎఫ్, సయ్యద్ నజీబ్ ఎస్ ఎస్, వీరేష్ డిఓపి, వెంకటేష్ ఎఫ్ ఎఫ్ తదితరులు పాల్గొన్నారు.