31-01-2026 12:21:00 PM
హైదరాబాద్: ప్రజా యుద్ధనౌక, తెలంగాణ పోరాటయోధుడు గద్దర్ (Gummadi Vittal Rao) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. అణచివేతకు వ్యతిరేకంగా తన ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన పోరాటవీరుడు గద్దర్ అని సీఎం స్మరించుకున్నారు. సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన గొంతుక గద్దర్(Gaddar) అని ఆయన కొనియాడారు. గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, ఆయన పేరుతో అవార్డును నెలకొల్పి ప్రతి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. గద్దర్ పాటలు, ఆలోచనలు, పోరాటస్ఫూర్తి ప్రజల మధ్య శాశ్వతంగా జీవిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.