calender_icon.png 22 July, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్‌లో సాంస్కృతిక వేడుకలు

21-07-2025 12:00:00 AM

కొత్తపల్లి, జూలై20(విజయక్రాంతి): సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని వారికి తరగతి గదిలో ఎదురయ్యే ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక రేకుర్తిలోని ఒక ప్రైవేట్ వేడుక మందిరంలో సంస్కృతి పేరుతో నిర్వహింపబడిన కొత్తపల్లిలోని అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాలల సాంస్కృతిక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై సరస్వతి మాత వి గ్రహానికి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు చ దువుతోపాటు వినోదం చాలా అవసరమని వినోదాత్మక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు విజయాల పట్ల ఆసక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థికి సాంస్కృతిక కార్యక్రమాల పట్ల కనీస అవగాహన ఉండడమే కాకుండా వాటిలో పాల్గొనేందుకు ఉత్సాహం ప్రదర్శించి పాల్గొని ఉపశమనం పొందాలని సూచించారు.

1991 లో ప్రారంభమైన అల్ఫోర్స్ విద్యాసంస్థలు నేటికీ తరగని ఉత్సాహంతో విద్యార్థులకు రెట్టింపైన నాణ్యతతో విద్యను అందిస్తూ ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిందని , వేస్తున్నదని తెలియజేశారు. ఇటీవల కాలంలో పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలలో, ఎన్‌ఐటీలలో ఐఐఐటీలలో, ఎయిమ్స్ లో సీట్లు సాధించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఘనంగా సన్మానంచేశారు.