22-07-2025 09:10:14 AM
హైదరాబాద్: దాశరథి కృష్ణమాచార్య శతజయంతి(Dasarathi Jayanthi celebrations) సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(Siddipet MLA Thanneeru Harish Rao) నివాళులర్పించారు. సాయుధపోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు.. దాశరధి అన్నారు. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' నేటికీ స్ఫూర్తి అన్నారు. తన కవిత్వంతో తెలంగాణ గౌరవాన్ని అత్యున్నస్థానంలో నిలబెట్టారని హరీశ్ రావు కొనియాడారు. ''తెలంగాణ విప్లవ శరధిలో ఎగిసిపడిన కవిత్వ తరంగం, ధిక్కార శతఘ్ని దాశరథి కృష్ణమాచార్యలు శత జయంతి సందర్భంగా ఘన నివాళి. సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దాశరథి గారు జైలు గోడల మీద బొగ్గుముక్కతో రాసిన ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అజరామరమై నేటికీ స్ఫూర్తినందిస్తున్నది. మహోన్నతమైన దాశరథి స్ఫూర్తి కొనసాగే దిశగా, వారి జయంతి రోజున ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ను తొలి సిఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం, సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్యస్ఫూర్తిదాయకం.'' అని హరీశ్ రావు ఎక్స్ లో పేర్కొన్నారు.