21-07-2025 12:00:00 AM
కరీంనగర్,జూలై20(విజయక్రాంతి): కరీంనగర్ నగరంలో ఎసిపి మాధవిని తన నివాసంలో మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. ఇటీవల ఎసిపి మాధవి భర్త కరీంనగర్ పిటిసి ప్రిన్సిపల్, ఏసీపీమహేష్ గుండెపోటుతో మృతి చెందారు. మహేష్ కుటుంబ సభ్యులను పరామ ర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కరీంనగర్ సుడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తదితరులుఉన్నారు.