22-07-2025 09:53:13 AM
హైదరాబాద్: హెచ్‌సీఏ అవకతవకలపై సీఐడీ(HCA irregularities ongoing) దర్యాప్తు కొనసాగుతోంది. ఐదుగురు నిందితులను సీఐడీ విచారిస్తోంది. నేటితో నిందితుల కస్టడీ విచారణ ముగియనుంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావును సీఐడీ విచారించనుంది. సీఈవో సునీల్ కంటే, రాజేందర్ యాదవ్, కవితను సీఐడీ విచారిస్తోంది. 23 ఇనిస్టిట్యూషన్ ఓట్లతో జగన్మోహన్ రావు అక్రమంగా ఎన్నికయ్యారని సీఐడీ గుర్తించింది. హెచ్సీఏ నిధుల మళ్లింపుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ విచారణ అనంతరం నిందితులను మల్కాజిగిరి జిల్లా కోర్టులో హాజరుపర్చనుంది.