calender_icon.png 22 July, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం.. దాశరథి

22-07-2025 10:20:01 AM

      1. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహాకవి దాశరథి.
      2. దాశరథి శత జయంతి సందర్భంగా కేటీఆర్ ఘన నివాళులు.
      3. అక్షర యుద్ధం సాగించి, ధిక్కార స్వరం వినిపించిన వైతాళికుడు దాశరథి.
      4. అద్భుత కావ్యాలతో తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపారు.
      5. పీడిత ప్రజల గొంతుకగా జీవించిన దాశరథి.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం.
      6. దాశరథి రచనలను, పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత మనపై ఉంది.

హైదరాబాద్: 'నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య(Daasarathi Krishnamacharyulu) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. దాశరథి గారి శత జయంతి సందర్భంగా కేటీఆర్ ఘన నివాళులర్పించారు. అక్షరయుద్ధం చేసి, ధిక్కార స్వరం వినిపించిన వైతాళికుడు దాశరథి అన్నారు. రుద్రవీణ, అగ్నిధార, కవితాపుష్యకంపునర్నవంఅమృతాభిషేకం, తిమిరంలో సమరం లాంటి సంకలనాలు, అద్భుత కావ్యాలు రచించిన దాశరథి తన కలంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపారని కొనియాడారు. పీడిత ప్రజల గొంతుకగా దాశరథి జీవించారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం.. దాశరథి అని కేటీఆర్ తెలిపారు. దాశరథీ రచనలు భావితరాలకు అందించే బాధ్యత మనపై ఉందని చెప్పారు. అంతటి మహాకవిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది.. వారి పేరిట సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది, వారి జయంతిని (జూలై 22) అధికారికంగా నిర్వహించిందని గుర్తుచేశారు.