22-07-2025 10:48:40 AM
న్యూఢిల్లీ: ఆరోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్(Vice President Jagdeep Dhankhar) అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పార్టీలకు అతీతంగా నాయకులు ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూనే, ఆయన నిర్ణయం చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆగస్టు 2022 నుండి భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ధంఖర్, జూలై 21, 2025న పదవీవిరమణ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల(Parliament Monsoon Session) తొలి రోజునే. ఆయన నిష్క్రమణ అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా, ప్రతిపక్షాలకు కేంద్రంపై దాడి చేసేందుకు అవకాశమిచ్చింది.
ఈ తరుణంలో ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్(Jairam Ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ధన్‌ఖడ్ నిర్ణయంలో లోతైన కారణాలు ఉన్నాయని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య ఏదో జరిగింది.? అని జైరాం రమేశ్ అనుమానం వ్యక్తం చేశారు. ధన్‌ఖడ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్‌కు జేపీ నడ్డా(Jagat Prakash Nadda), కిరణ్ రిజిజు హాజరుకాలేదన్న ఆయన వాళిద్దరూ బీఏసీకి రాకపోవడంపై ధన్‌ఖడ్‌కు సమాచారం ఇవ్వలేదన్నారు. జేపీ నడ్డా, కిరణ్ రిజిజు గైర్హాజరుపై ధన్‌ఖడ్ తీవ్రంగా స్పందించారు. రాజ్యసభ నిబంధనల(Rules of Rajya Sabha) విషయంలో ధన్‌ఖడ్ కఠినంగా వ్యవహరించారని జైరాం రమేష్ పేర్కొన్నారు.