14 July, 2026 | 6:56 PM

Breaking News

విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •  

ఐపీఎల్ నెక్ట్స్ లెవల్: కమిన్స్

30-04-2024 12:45 AM

చెన్నై: టీ20 క్రికెట్ మొదటి నుంచి బ్యాటర్లకే అనుకూలమని.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ఆ స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని పేర్కొన్నాడు. చెన్నైతో మ్యాచ్ ఓటమి అనంతరం కమిన్స్ మాట్లాడుతూ.. ‘ మ్యాచ్‌లో మేము అమలు చేయాలనుకున్న ప్లాన్ ఫలించలేదు. చేజింగ్ ద్వారా మ్యాచ్ గెలుద్దామనుకున్నాం.. కానీ నిరాశ ఎదురైంది. రాబోయే మ్యాచ్‌ల్లో తప్పులు సరిదిద్దుకుంటాం. ఈ సీజన్‌లో అన్ని జట్లు సులువుగా 200 ప్లస్ స్కోర్లు బాదేస్తున్నాయి. పిచ్‌లు బౌలింగ్ కంటే బ్యాటింగ్‌కే ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి. అందుకే పరుగుల వరద పారుతోంది. సాధారణంగా టీ20 క్రికెట్ బ్యాటర్లకు అనువుగా ఉంటుంది. ఫ్లాట్ పిచ్‌లు రూపొందించడం ద్వారా ఐపీఎల్ దానిని మరో స్థాయికి తీసుకెళ్లింది’ అని కమిన్స్ తెలిపాడు.