14 July, 2026 | 6:20 PM

Breaking News

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •   త్రాగునీటి శుద్ధి కేంద్రాలు ఆకస్మిక తనిఖీ   •   ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ   •  

కివీ సైన్యమిదే

30-04-2024 12:48 AM

ఆక్లాండ్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోమవారం జట్టును ప్రకటించింది. కేన్ విలియమ్సన్ నేతృత్వంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, బౌలర్ మాట్ హెన్రీలు తొలిసారి పొట్టి ప్రపంచకప్ ఆడనున్నారు. బెన్ సీర్స్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. ఇక కెప్టెన్ విలియమ్సన్‌కు ఇది ఆరో ప్రపంచకప్ కావడం విశేషం. బొటనవేలి గాయం అనంతరం కోలుకున్న కాన్వేకు పొట్టి ప్రపంచకప్‌నకు పిలుపు వచ్చింది. ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ట్రెంట్ బౌల్ట్ తిరిగి జట్టులోకి రాగా.. మరో సీనియర్ బౌలర్ టిమ్ సౌథీ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. సౌథీకి రికార్డుస్థాయిలో ఇది ఏడో టీ20 ప్రపంచక్ కాగా.. బౌల్ట్‌కు 5వది. కాగా.. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇద్దరు చిన్నారుల ద్వారా జట్టు సభ్యుల పేర్లు ప్రకటించడం గమనార్హం.

న్యూజిలాండ్ జట్టు: విలియమ్సన్ (కెప్టెన్), అలెన్, బౌల్ట్, బ్రాస్‌వెల్,  చాప్‌మన్, కాన్వే, ఫెర్గూసన్, హెన్రీ, డారిల్, నీషమ్, ఫిలిప్స్, రచిన్, సాంట్నర్, సోదీ, సౌతీ, సీర్స్ (ట్రావెలింగ్ రిజర్వ్)