25-11-2025 12:42:17 AM
- కూరగాయల ధరలు రెట్టింపు
- మోంథా తుఫానుతో పెరిగాయంటున్న వ్యాపారులు
- పలు కారణాలు చూపుతూ విక్రయాల్లో దోపిడీ
- పేదలు, సామాన్యులపై అదనపు భారం
మెదక్, నవంబర్ 24(విజయక్రాంతి): కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. కార్తీక మాసం నుండి కూరగాయల వినియోగం పెరుగుతూ రావడంతో ధరలు అధికమయ్యాయి. అయితే వ్యాపారులు మాత్రం జిల్లాలో సాగు తగ్గడంతో పాటు మోంథా తుపాను వల్ల కూరగాయల ధరలు పెరిగాయని తెలుపుతున్నారు. కాగా రూ. 500 తీసుకెళ్లినా సంచి నిండా కూరగాయ లు రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా కొన్ని కూరగాయల ధరలు తక్కువగా ఉన్నప్పటికీ వ్యాపారులు మాత్రం అమాంతం పెంచి అ మ్ముతూ దోపిడీ చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మార్కెట్ ఏ కూరగాయ చూసి నా రూ.80 - రూ.100 కిలో చొప్పున అమ్ముతున్నారు.
కార్తీక మాసం ముగిసినా...
గత నెల 22వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈనెల 19వ తేదీతో ముగిసింది. ఈ మా సంలో దాదాపు ప్రతీ ఇంట్లో రోజూ పూజ లు నిర్వహించారు. పూజల కారణంగా కూరగాయల వంటలే వండుతారు. దీంతో కూర గాయల ధరలు విపరీతంగా పెంచారు. కొన్ని కూరగాయల ధరలు సాధారణంగా ఉన్నప్పటికీ వ్యాపారులు భారీగా పెంచి అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ మాసంలో అయ్యప్ప మాలధారణ వేసే వా రి సంఖ్య పెరిగింది. ఈ కారణం చూపి వ్యాపారులు కూరగాయల ధరలు పెంచేస్తున్నారు. కార్తీక మాసం ముగిసినప్పటికీ ఇం కా కూరగాయల ధరలు మాత్రం తగ్గడం లేదు.
మోంథా తుఫాను ప్రభావం అంటున్న వ్యాపారులు..
మోంథా తుఫాను ప్రభావంతోనే ధరలు పెరిగాయని హోల్ సేల్ కూరగాయల వ్యా పారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, విజయవాడతో పాటు పలు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతి చేసుకుంటున్నామని వ్యాపారులు తెలిపారు. తు ఫాను కారణంగా కూరగాయల పంటలు పా డైపోయి మిగిలిన కూర గాయల ధరలు పెం చారని చెబుతున్నారు. అంతేగాకుండా జిల్లా లో కూరగాయల సాగు తగ్గడం వల్ల కూడా ధరలు పెరిగాయని అంటున్నారు.