25-11-2025 12:00:00 AM
నిజామాబాద్/జగిత్యాల అర్బన్, నవంబర్ 24 (విజయక్రాంతి): అవినీతి రహిత సమాజం కోసం యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డీ) రాష్ర్ట అధ్య క్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రియ లోక్‌దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక చైతన్య రథయాత్ర సోమవారం సోమవారం నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చేరుకుంది. ఆయా కేంద్రాల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పాలించిన బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రెండు కూడా తెలం గాణకు తీవ్ర ద్రోహం చేశాయని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే రాష్ర్టంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావించిన లక్షలాదిమంది యువత తెలంగాణ ఉద్య మంలో పనిచేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత యువత ఆశలు అడియాసలు అయ్యాయని విమర్శించారు.
భౌగోళిక తెలంగాణ ఏర్ప డిందే తప్పా సామాజిక తెలంగాణ ఏర్పడలేదన్నారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక వ్యవస్థ లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇప్పటికీ కనీసం రెం డు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని, 28 లక్షల మంది యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా కృషి చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతతోనే బహుజనులకు రాజకీయ అధికారం వస్తుం దని ఆ దిశగా రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ కృషి చేస్తుందన్నారు.
అవినీతి రహిత సమాజ నిర్మా ణం కోసం యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు. యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించడంతోపాటు వారికి ఉపాధి కల్పించే విషయంలో తమ పార్టీ తెలంగాణలోని అన్ని జిల్లాలలో జాబ్ మేలాలను నిర్వహించి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో యువతకు ఎక్కువ సీట్లు కేటాయించి, అన్ని విధాల ప్రోత్సహిస్తామని తెలిపారు.
రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, చివరికి రిటైర్డ్ ఉద్యోగులకు చెందవలసిన లాభాలను కూడా ప్రభు త్వం దారి మళ్లించడం అన్యాయమన్నారు. బీసీలకు 42 శాతం చట్టబద్ధ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలు అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం తో ఉన్నారన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలు విస్మరించడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సా మాజిక వర్గాలను చైతన్యం చేసి వారిని రాజకీయ అధికారానికి దగ్గర చేయడం కోసం తమ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ర్టంలో సామాజిక చైతన్య యాత్రలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ చేతులెత్తేసింది
సంక్షేమ పథకాల అమలుకు నిధులు లేవని రేవంత్‌రెడ్డి సర్కార్ చేతులెత్తేసిందని ఆరోపించారు. ప్రవేట్ పరిశ్రమలు స్థానికులకే 95% ఉద్యోగాలు కల్పించేలా చట్టం చేయాలన్నారు. నిరుద్యోగులు సొంత పరిశ్రమలు స్థాపించుకునే విధంగా వారికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడంతోపాటు రాజీవ్ యువ వికాసం పేరిట ఐదు లక్షల మంది నిరుద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు రూ.2500 చెల్లించడంతోపాటు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద తులం బంగారం ఇవ్వాలన్నారు. ప్రస్తుత సర్కారులోని అధికారులు రాజకీయ నాయకులు అవినీతికి పాల్ప డుతూ లక్షల కోట్ల అక్రమ సంపాదనతో ఉన్నారని ఆరోపించారు. పర్సెంటేజీలు లేనిదే ఏ ఫైలు కదలడం లేదని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌లోని మంత్రి స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ రేస్ కేసుల విషయం మాట్లాడటం ప్రభుత్వం మానేసిందన్నారు. ప్రస్తుతం జరిగే సంస్థ గత ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు సెంట్రల్ ఫోర్స్‌తో లా అండ్ ఆర్డర్‌ను పరిరక్షిస్తూ జరపాలని ఆయన డిమాం డ్ చేశారు. ఆయా సమావేశాల్లో ఆర్ ఎల్ డి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రిషబ్ జైన్, హసన్ నాయక్, బుస్సాపూర్ శంకర్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బీరప్ప, పార్టీ ప్రధాన కార్యదర్శులు మడకం ప్రసాద్ దొర, నర్సింహారావు, బుల్లెట్ వెంకన్న పాల్గొన్నారు.