25-11-2025 12:45:26 AM
-స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు
-సర్పంచిగా పోటీ చేయాలని భావించిన వారికి కలిసి రాని రిజర్వేషన్లు
-ఆశావాహూలకు రిజర్వేషన్ల నిరాశ
-కామారెడ్డి జిల్లాలో రిజర్వేషన్ల ఖరార్ తో ఆశవాహూల నారాజ్
కామారెడ్డి, నవంబర్ 24 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ను అధికారులు ఖరారు చేయడంతో ఆశావాహూలకు షాక్ ఎదురైంది. ఊహించిందొకటి రిజర్వేషన్ అయింది మరొకటి అంటూ ఆశావాహులు కు రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో నారాజ్ లో ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 533 సర్పంచ్ స్థానాలకు,6098 వార్డ్ స్థానాలకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ప్రతి మండల లో ఎంపీడీవో కార్యాలయాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకుల ముందు రిజర్వేషన్లను ఖరారు చేశారు.
గతంలో వచ్చిన గ్రామాలకు మళ్లీ అదే రిజర్వేషన్లు
కామారెడ్డి జిల్లాలో కొన్ని గ్రామాలలో గత ఎన్నికల్లో వచ్చిన రిజర్వేషన్లు మళ్లీ రావడంతో ఇతర వర్గాలకు చెందిన ఆశవాహూలకు చుక్కెదురైంది. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు వస్తాయని భావించిన ఆశావావులకు కొన్ని గ్రామాల్లో కలిసి వచ్చిన కొన్ని గ్రామాలలో నిరాశ మిగిలింది. అనుకున్నట్లుగా రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో ఎన్నో రోజులుగా పోటీ చేస్తామని ఆశలు పెట్టుకున్న ఆశావా హూవుల ఆశలు గల్లంతయ్యాయి. కొన్ని గ్రామాలకు పాత రిజర్వేషన్లే మళ్లీ రావడంతో ఇతరుల కు రిజర్వేషన్లు కలిసి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా బిక్కనూరులో స్వాతంత్రం వచ్చిన నుంచి ఎస్సీ రిజర్వేషన్ రాలేదని ఎప్పుడు తమ వర్గానికి అవకాశం వస్తుందని ఎస్సీ వర్గానికి చెందిన స్థానిక నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గత ఎన్నికల్లో ఐదు గ్రామాలకు ఎస్సీ రిజర్వేషన్లు రాగ ఈసారి మూడు గ్రామాలకు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్లు రావడం వల్ల తాము నష్టపోతున్నామని ఎస్సి వర్గానికి చెందిన నేతలు వాపోతున్నారు. జనరల్ అవుతుందని ఆశలు పెట్టుకున్న మేజర్ గ్రామాల్లో ఆశావాహూల ఆశలు గల్లంతయ్యాయి.
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో జనరల్ రిజర్వేషన్ వస్తుందని భావించిన వారికి ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడంతో తమకు రిజర్వేషన్ అనుకూలించక సర్పంచి స్థానానికి పోటీ చేయలేకపోతున్నామని ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ ఆశలు గల్లంతు ఆయ్యాయని విజయ క్రాంతి ప్రతినిధి తో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో రిజర్వేషన్ వచ్చిన ఓటర్ కూడా లేరని ఆ గ్రామాల్లో ఆ రిజర్వేషన్ రద్దుచేసి గ్రామాల్లో ఉన్న బీసీ ఎస్సీ జనరల్ స్థానాలకు రిజర్వ్ చేసి అవకాశం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
స్థానికులు ఉన్నవారికి రిజర్వేషన్ కల్పిస్తే గ్రామాల అభివృద్ధికి సహకారం కలిసి వస్తుందని అంటున్నారు. గ్రామంలో సర్పంచ్ స్థానం రిజర్వేషన్ కలిసి వచ్చిన గ్రామంలో ఓటర్ లేకుండా సర్పంచ్ ఎలా ఎన్నుకోవాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ చొరవచూపి రిజర్వేషన్లు అవకాశం కల్పించాలనీ కోరుతున్న స్థానిక నేతలు కొన్ని గ్రామాలకు రిజర్వేషన్లు వరించిన ఆ గ్రామంలో ఆ రిజర్వేషన్ సంబంధించిన ఓటర్లు కానీ పోటీ చేసే అభ్యర్థులు లేరని అలాంటి చోట రిజర్వేషన్ చేంజ్ చేసి స్థానికంగా ఉన్న వర్గాల వారికి రిజర్వేషన్ చేయాలని కోరుతున్నారు.
రిజర్వేషన్ కలిసి వస్తుందని ఖర్చు పెట్టుకున్నాం
కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో స్థానిక సంస్థల్లో సర్పంచ్ స్థానాలకు పోటీ చేద్దామని భావించిన ఆశావహులు గత రెండు సంవత్సరాలుగా ఓటర్ల కోసం తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వివిధ సందర్భాల్లో డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. ఈసారి తమకు అనుకూలంగా రిజర్వేషన్ కలిసి వస్తుందని ఆశతో ఖర్చు పెట్టుకున్న కొందరికి చుక్కెదురురయింది. అటు డబ్బులు ఖర్చు ఇటు రిజర్వేషన్ కలిసి రాక కొందరు ఆశావాహూలు షాక్ కు గురై మదన పడుతున్నారు. కనీసం ఎంపీటీసీ, జెడ్పిటిసి స్థానాల్లో అవకాశం వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారు. రిజర్వేషన్ల ఖరార్ లో అవకాశం రాక రాబోయే ఎన్నికల్లో సైతం రిజర్వేషన్లు కలిసి వస్తే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
రిజర్వేషన్లు ఖరారు కావడంతో పోటీకి సమయాత్తం
స్థానిక సంస్థల గ ఎన్నికలలో గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను మండల ఎంపీడీవో కార్యాలయాల్లో అధికారులు ఖరారు చేయడంతో సంబంధిత వర్గాల వారు పోటీ చేసేందుకు సమయాత్తమవుతున్నారు. రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వచ్చిన వారు పోటీ చేసేందుకు స్థానిక వార్డుల్లో, కుల సంఘాలు, ఓటర్లు నువ్వు కలిసి తాము పోటీ చేస్తున్నట్లు తమకు మద్దతు ఇవ్వాలని గ్రామాల్లో ఆశావాహూలు సమయత్తమవుతున్నారు. తమకు మద్దతు ఇచ్చేవారు ఎవరు చేయి ఇచ్చేవారు ఎవరు ఎవరితో వారికి మాట్లాడిస్తే తమకు అనుకూలంగా మారుతారు అనే లెక్కల్లో పోటీ చేసే ఆశావాహులు లెక్కలేసుకుంటున్నారు. రిజర్వేషన్లు కలిసి వచ్చినవారు పోటీ చేసేందుకు తహతహ లాడుతున్నారు. రిజర్వేషన్లు కలిసి రాని వాళ్ళు రాబోయే ఎన్నికల లోనైన రిజర్వేషన్లు కలిసి వస్తాయేమోనని ఆశతో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనుoడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
దావతులకు తెర
గ్రామాలలో పోటీ చేసే ఆశవా హూలు తమ వైపు తిప్పుకునేందుకు వార్డు సభ్యులను తమకు అనుకూలంగా ఎవరిని నిలపాలి, తమ గెలుపు కోసం కృషి చేసే యువకులు ఎవరు, ఏ కులము తమకు అనుకూలంగా వ్యవహరిస్తారు, తమకు ఎవరు చేయిస్తారు అనే విషయాలపై పోటీ చేసే ఆశవాహూలు గ్రామాలలో చర్చించుకుంటున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకు నే ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీ చేసేందుకు తహతలాడుతున్న ఆశావా హూలు గతంలో జరిగిన తప్పిదాలను మన్నించి ఈసారి తన గెలుపు కోసం కృషి చేయాలని యువతకు నచ్చచెప్పుతున్నారు. మందు పార్టీలను వారికి అనుకూలంగా ఏర్పాటు చేసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
గ్రామాలలో స్థానిక ఎన్నికల సందడి
గ్రామాల్లో రిజర్వేషన్లు ఖరారు కావడంతో పోటీ చేసే ఆశావహులు తాము సర్పంచిగా , వార్డు సభ్యునిగా పోటీలో ఉంటానని తనకు మద్దతు ఇవ్వాలంటూ గ్రామాలలో విందు పార్టీలను చేశారు. దీంతో గ్రామాలలో స్థానిక ఎన్నికల సందడి షురూ అయింది.