16 July, 2026 | 5:06 PM

వడ్డీ రేట్ల కోత.. ఆశలు గల్లంతు

19-04-2024 12:15 AM

ఫెడ్ చైర్మన్ సంకేతాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, రుణగ్రస్తులు వడ్డీ రేట్ల తగ్గుదలపై ఎంతగానో పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ ఈ అంశమై సంకేతాలిచ్చారు. ఈ ఏడాది జూన్ నెలలో తొలుత ఒక దఫా రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలపై నీళ్లు చల్లుతూ తమ ద్రవ్య విధానాన్ని దీర్ఘకాలంపాటు కఠినంగానే ఉంచాల్సిన అవసరం కనపడుతున్నదని తాజాగా వాషింగ్‌టన్‌లో జరిగిన ఒక సదస్సులో పొవెల్ చెప్పారు. ‘ఇటీవలి డేటా మాకు విశ్వాసాన్ని (రేట్లు తగ్గించేందుకు) ఇవ్వడం లేదు.

ఈ విశ్వాసం పెంపొందడానికి దీర్ఘకాలం పట్లేరీతిలోనే ఆర్థిక గణాంకాలు వెలువడుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం పెరుగుదల, జాబ్ మార్కెట్ పటిష్టత కఠిన ద్రవ్య విధానాన్ని మరింతకాలం కొనసాగించేలా చేస్తున్నాయని పొవెల్ చెప్పారు.  ఐదు వారాల క్రితం వడ్డీ రేట్లను తగ్గించడానికి మరెంతో సమయం అవసరం లేదన్న పొవెల్ తాజా ఆర్థిక గణాంకాలతో ఇన్వెస్టర్లకు షాకిచ్చారు. ఫెడ్ రేట్ల కోత తర్వాత భారత్‌లో రిజర్వ్‌బ్యాంక్ సైతం వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.