calender_icon.png 9 January, 2026 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల స్నాక్స్‌లో కోత

08-01-2026 01:11:23 AM

గత సంవత్సరంలో 39 రోజులు.. ఇప్పుడు 19 రోజులే..

పదో తరగతి విద్యార్థుల ఈవెనింగ్ స్నాక్స్‌కు రూ.4.23 కోట్లు విడుదల

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): పదో తరగతి విద్యార్థులకు అందించే స్నాక్స్‌లో ప్రభుత్వం కోత విధించింది. వార్షిక పరీక్షల సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహించనుంది. అయితే ఖాళీ కడుపుతో విద్యార్థులు పాఠాలు వినడం కష్టమవడంతో వారికి స్నాక్స్ అందించాలని గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే దానికి సంబంధించిన రూ. 4,23,11,385 నిధులను బుధవారం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 4,303 స్కూళ్లకు జిల్లాల వారీగా నిధు లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1,48,461 మంది విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి ఒక రోజుకు రూ.15 చొప్పున 19 రోజుల (ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10) పాటు స్నాక్స్ కోసం ఖర్చు చేయనున్నారు.

అయితే విద్యార్థులకు అందించే ఈ స్నాక్స్ రోజుల్లో ప్రభుత్వం 20 రోజులు కోత విధించినట్లుగా పలు టీచర్ సంఘాల నుంచి విమర్శ లు వినిపిస్తున్నాయి. గత విద్యాసంవత్సరంలో 39 రోజులు స్నాక్స్ అందిస్తే ఈసారి 19 రోజులకే కుదించారు. స్నాక్స్‌ను 45 రోజులు అం దించడం అవసరమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కటకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డి కోరా రు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వెంటనే సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.