08-01-2026 01:11:19 AM
కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికిన షబ్బీర్ అలీ
కామారెడ్డి, జనవరి 7 (విజయక్రాంతి): పలు పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.కామారెడ్డి పట్టణం దేవన్పల్లి పరిధిలోని వార్డ్ నంబర్లు 9, 10, 11, 12, 34, 35 వార్డుల నుంచి న భారీ సంఖ్యలో బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ నీలం చంద్రశేఖర్ తోపాటు బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమా ర్ షట్కార్ లు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ..
ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విధానాలు నచ్చి వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరడం ఆనందకరమని, ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనమని షబ్బీర్ అలీ అన్నారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనలోనే నిజమైన అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కొత్తగా చేరిన ప్రతి కార్యకర్త కృషి కీలకమని చెప్పారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ప్రజల కోసం పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.