calender_icon.png 21 January, 2026 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కేర్’లో అత్యాధునిక శస్త్రచికిత్స

21-01-2026 01:27:14 AM

పుర్రె ఎముక తెరవకుండానే స్కల్బేస్ క్యాన్సర్‌కు చికిత్స

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం, హార్మోన్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఎదురైనా తల ఎముక తెరవకుండానే అరుదైన స్కల్బేస్ క్యాన్సర్‌ను విజయవంతంగా కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు తొలగించారు. ముక్కు మార్గం ద్వారా చేసిన అత్యాధునిక ఎండోస్కోపిక్ శస్త్రచికిత్సతో ఈ క్లిష్టమైన క్యాన్సర్కు పూర్తిగా విముక్తి కలిగించారు. న్యూరో మరియు స్కల్బేస్ సంబంధిత అత్యంత క్లిష్ట కేసులను కూడా సురక్షితంగా నిర్వహించే కేర్ హాస్పిటల్స్ నైపుణ్యానికి ఇది మరో ఉదాహరణ. దీంతో మహబూబాబాద్‌కు చెందిన భూక్య రోజా (31) పూర్తిగా కోలుకున్నది.

కేర్ హాస్పిటల్ వైద్యులు చేసిన ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్లలో ఆమెకు సైనోనాసల్ కాండ్రోసార్కోమా అనే అత్యంత అరుదైన స్కల్బేస్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్య బృందం ఎండోస్కోపిక్ ఎండోనాసల్ స్కల్బేస్ పద్ధతిని ఎంచుకుని, ముక్కు మార్గం ద్వారానే కణితిని చేరుకుని తొలగించారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను డాక్టర్ కె. వంశీ కృష్ణ, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, స్కల్బేస్ సర్జరీ నిపుణుడు, అత్యాధునిక హైడెఫినిషన్ ఎండోస్కోప్స్, ఇమేజింగ్ గైడెన్స్, సూక్ష్మ శస్త్ర పరికరాల సహాయంతో నిర్వహించారు. అత్యంత క్లిష్టమైన న్యూరో లాజికల్ కేసుల్లో కూడా రోగి కేంద్రిత, ప్రపంచ స్థాయి వైద్యం అందించడమే కేర్ హాస్పిటల్స్ లక్ష్యం అని నిలేశ్ గుప్తా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, కేర్ హాస్పిటల్స్  హైటెక్ సిటీ అన్నారు.