21-01-2026 01:23:30 AM
‘పావని మిరాయ్’ను ఆవిష్కరించిన పావని ఇన్ఫ్రా
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ పావని ఇన్ఫ్రా తమ ఫ్లాగ్షిప్ అల్ట్రా-లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘పావని మిరాయ్’ను ఆవిష్కరించింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నిర్మాణం కానున్న 55 అంతస్తుల ఈ అద్భుత స్కైస్క్రేపర్‌ను గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అన్వయ కన్వెన్షన్‌లో ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్ట్ బ్రోచర్‌ను అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డా. బాబీ ముక్కమల ప్రముఖ వైద్య నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు.
కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డా. గురు ఎన్. రెడ్డి, ఐఎంఏ అధ్యక్షుడు డా. దిలీప్ భానుశాలి, ఏహెచ్పీఐ డైరెక్టర్ జనరల్ డా. గిరిధర్ జే. గ్యాని, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంగిత రెడ్డి, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపక చైర్మన్ డా. గుల్లపల్లి నాగేశ్వర రావు, స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా. గోపిచంద్ మన్నం, యశోదా హాస్పిటల్స్, ఏఐజీ హాస్పిటల్స్ సీనియర్ నాయకత్వం, నటుడు సుమంత్ పాల్గొన్నారు.
పావని ఇన్ఫ్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్కెటింగ్ లక్ష్మీ శ్రావంతి పాకలపాటి మాట్లాడుతూ.. పావని మిరా య్ హైదరాబాద్ స్కైలైన్ను పునర్నిర్వచించే శాశ్వత ఆర్కిటెక్చరల్ ఐకాన్గా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. పావని ఇన్ఫ్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రాజెకట్స్ డా. సాయి హర్ష పాకలపాటి మాట్లాడుతూ.. ప్రముఖ వైద్య మొత్తం ప్రాజెక్ట్ విస్తీర్ణంలో 75 శాతం ఓపెన్ ల్యాండ్స్కేప్డ్ స్పేస్కు కేటాయించటం ద్వారా ఆరోగ్యకేంద్రిత జీవనానికి ప్రాధాన్యతనిచ్చినట్లు పేర్కొన్నారు. పావని పాకలపాటి (డైరెక్టర్), పావన్ కుమార్ దిట్టకవి (డైరెక్టర్ ఆపరేషన్స్), సి. రిషి చౌదరి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్) పాల్గొన్నారు.
720 అడుగుల ఎత్తుతో నిర్మించబడుతున్న పావని మిరాయ్, పావని ఇన్ఫ్రా రూపొందించిన అత్యంత ఆధునిక లగ్జరీ ప్రాజెక్ట్గా నిలవనుంది. కేవలం 178 కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్లో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో విశాలమైన నివాసాలు, 2.5 లక్షల చదరపు అడుగుల ఆధునిక సౌకర్యాలు, నాలుగు స్థాయిల క్లబ్హౌస్, సహజ తత్త్వాల నుంచి ప్రేరణ పొందిన నాలు గు స్కై పాడ్స్ ఉన్నాయి.