1 May, 2026 | 2:34 PM

తెలంగాణ పోలీస్ దేశంలోనే నెం.1: డీజీపీ సీవీ ఆనంద్

01-05-2026 01:10 PM

నేరగాళ్ల టెక్నాలజీ పోలీసులకు సవాల్

తెలంగాణ పోలీస్‌శాఖ ఒక బ్రాండ్.. రాజీపడొద్దు

హైదరాబాద్: తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్(Telangana DGP CV Anand) బాధ్యతలు స్వీకరించారు. సీవీ ఆనంద్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 2028 జూన్ వరకు సీవీ ఆనంద్ డీజీపీగా కొనసాగనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తామని డీజీపీ వెల్లడించారు. ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరేలా కృషి చేస్తామన్నారు. కొత్త టెక్నాలజీని మరింత వాడుకుంటూ సమర్థంగా పనిచేస్తామని తెలిపారు. శాంతి భద్రతల్లో(Law & Order) సమస్య రాకముందే అప్రమత్తంగా ఉండటం మంచిదని డీజీపీ సూచించారు.

నేరాల దర్యాప్తులో తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఉత్తమ పనితీరు కనబరిచారని కొనియాడారు. తెలంగాణ పోలీస్(Telangana Police) దేశంలోనే నంబర్ వన్ గా ఉందన్నారు. మారుతున్న పరిస్థితుల్లాగే నేరాలు జరుగుతున్న విధానం కూడా మారిందన్నారు. నేరగాళ్లు కొత్త కొత్త టెక్నాలజీని అనుసరిస్తూ నేరాలు చేస్తున్నారని సీవీ ఆనంద్ వెల్లడించారు. నేరగాళ్లు అనుసరిస్తున్న టెక్నాలజీ పోలీసులకు కూడా సవాలు విసురుతోందన్నారు. సైబర్ నేరాల కట్టడిలో ఎస్పీల పాత్ర కీలకం అన్నారు.

తెలంగాణలోడ్రగ్స్ నిర్మూలన(Eradication of Drugs) అత్యంత ప్రాధాన్యం అన్న డీజీపీ డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ పోలీసు బృందం(Eagle Police Team) బాగా కృషి చేస్తోందని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా.. డ్రగ్స్ ముఠాలు కూడా విస్తరిస్తున్నాయని వివరించారు. రాష్ట్రస్థాయి ట్రాఫిక్ మేనేజ్ మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేస్తామని డీజీపీ ఆనంద్ స్పష్టం చేశారు. ఉమెన్ సేఫ్టీ, చైల్డ్ ట్రాఫికింగ్(Child Trafficking) సమస్యపై ఫోకస్ పెడతామని డీజీపీ పేర్కొన్నారు. త్వరలోనే పోలీస్ శాఖ పునర్ వ్యవస్థీకరణ చేస్తామని వెల్లడించారు. పోలీస్ శాఖలో ఖాళీలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. పోలీస్ శాఖలో ఏఐ తీసుకొస్తామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.