2 September, 2026 | 11:27 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

షేర్‌మార్కెట్ పేరుతో సైబర్ మోసం

10-12-2024 | 01:41am

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 9 (విజయక్రాంతి): షేర్ మార్కె ట్‌లో పెట్టుబడుల పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నమ్మించి సైబర్ నేరగాళ్లు 8.41 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి(45)కి ఇటీవల స్కామర్లు ఫోన్ చేసి షేర్ మా ర్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించారు. 

వారి మాటలు నమ్మిన బాధితుడు పలు దఫాలుగా మొత్తం రూ.8.41 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకోవడానికి స్కామర్లు అవకాశం కల్పించలేదు. జరిగిన మోసాన్ని గ్రహించిన బాధితుడు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.