5 May, 2026 | 1:24 AM

కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట?

10-12-2024 01:39 AM
  1. * ఆదిలాబాద్ నాయకుల మధ్య విభేదాలు!

* నాయకుల ఇళ్లే.. వారికి పార్టీ కార్యాలయాలు

* నేతల మధ్య వర్గపోరుతో పార్టీ శ్రేణుల్లో అయోమయం

ఆదిలాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో నాటి నుంచి నేటి వరకు మూడు ముక్కలుగా కొనసాగుతోం ది. పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా నాయకుల మధ్య మాత్రం వర్గవిభేదాలు కొనసా గుతూనే ఉన్నాయి. ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో గత రెండు, మూడు దశాబ్దాల కాలం నుంచి వర్గపోరు కొనసాగుతుండటంతో పలుమా ర్లు పార్టీకి భారీ నష్టం సైతం చేకూరింది.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం నాయకుల మధ్య ఉన్న విభేదాల వల్ల గెలిచే ఆదిలాబాద్ అసెంబ్లీ సీట్లు సైతం కోల్పోవలసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావి స్తున్నారు. ఎంతో కాలం నుంచి పార్టీలో ముఖ్య నేతలు తమ తమ వర్గాలుగా ఏర్పా టు చేసుకుని ఎవరికివారు కార్యక్రమాలు చేపట్టడంతో పార్టీలోని దితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఏ వర్గం వైపు ఉండాలో తేల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. 

గతంలో ముగ్గురు నేతల మధ్య..

కాంగ్రెస్ పార్టీలో ఆది నుంచి నాయకత పోరు కొనసాగుతోంది. గతంలో మాజీ మంత్రి, సర్గీయ చిలుకురి రామచంద్రారెడ్డి వర్గం, అప్పటి టీపీసీసీ ప్రధాన కార్యదరి గండ్రత్ సుజాత వర్గం, డీసీసీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే వర్గంతో పార్టీలో మూడుముక్కలాట కొనసాగేది. ఒక వర్గానికి చెందిన నాయకుడికి ఎమ్మెల్యే టికెట్టు లభిస్తే మరో రెండు వర్గాలు వ్యతిరేకిస్తూ, టికెట్టు వచ్చిన వారిని ఓడగొట్టేందుకు ప్రయత్నాలు చేశారని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. దీంతో ఎన్నోమార్లు గెలుపు అవకాశమున్న ఓటమి పాలు కావలసి వచ్చింది. 10 ఏళ్లుగా అధికారం కోల్పో యి, దినదినం పార్టీ నష్టపోతున్న తరుణంలో కొత్త డీసీసీ అధ్యక్షుడిగా సాజిద్ ఖాన్‌కు బాధ్యతలు అప్పగించారు.  

కొత్త నేతల ప్రవేశంతో ఒక్కటైన సీనియర్లు

ఇటీవల కాలంలో పార్టీలోకి కొత్త నేత కంది శ్రీనివాస్‌రెడ్డి రంగ ప్రవేశం చేయడంతో ఆయనకు టికెట్టు ఇవొద్దని, సీనియర్లమైన తమలో ఒకరికి టికెట్ ఇవాలంటూ అప్పటివరకు విభేదాలతో కొనసాగిన రామచంద్రారెడ్డి వర్గం, సుజాత వర్గం, భార్గవ్ దేశ్‌పాండే వర్గం, సాజిద్‌ఖాన్ వర్గం ఒకటయ్యాయి. ఈ క్రమంలోనే రామచంద్రారెడ్డి మృతిచెందారు. దీంతో కంది శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ టికెట్టు లభించింది.

దీన్ని సుజాత వర్గం, రామచంద్రారెడ్డి వర్గీయులు వ్యతిరేకించి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరును తప్పుపడుతూ తిరగబడ్డారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సీనియర్ల వర్గానికి చెందిన డీసీసీ అధ్యక్షుడు సాజిత్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదరి గండ్ర సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డిలను పార్టీ నుంచి బహిష్కరించారు. 

తాజాగా మరో ముగ్గురు నేతలు..

గతంలో సీనియర్ల మధ్య వర్గపోరు ఉండగా తాజాగా కొత్త, పాత నేతల మధ్య వర్గ పోరు కొనసాగుతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న కంది శ్రీనివాస్‌రెడ్డి ఓ వర్గాన్ని కొనసాగిస్తున్నారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ర్ట ప్రధాన కార్యదరి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి మరో వర్గాన్ని కొనసాగిస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కృతమైన సీనియర్లు అందరూ రామచంద్రారెడ్డి పేరిట ఓ వర్గాన్ని కొనసాగిస్తున్నారు.

నాయకుల మధ్య ఉన్న వర్గపోరుతో పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమమైనా మూడు చోట్ల నిరహించడం నేటికీ ఆనవాయితీగానే కొనసాగుతోంది. కంది శ్రీనివాస్‌రెడ్డి వర్గం ఆయన క్యాంపు కార్యాలయంలో, కిసాన్ సెల్ రాష్ర్ట ప్రధాన కార్యదరి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి మావలలోని తన సగృహంలో, సీనియర్ల వర్గం రామచంద్రారెడ్డి సగృహంలో కార్యక్రమాలు నిరహిస్తున్నారు. సోమవారం కాంగ్రెస్ జాతీయ నాయకు రాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను సైతం ముగ్గురు నాయకులు మూడు చోట్ల నిరహించడం కొసమెరుపు.