10 June, 2026 | 2:54 AM

సైబరాబాద్ ప్రెస్ అండ్ పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్ ప్రారంభం

10-06-2026 12:38 AM

శేరిలింగంపల్లి, జూన్ 9 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం. రమేష్ (ఐపీఎస్), మంగళవారం సీపీ కార్యాలయ పరేడ్ గ్రౌండ్లో సైబరాబాద్ ప్రెస్ అండ్ పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్  2026ను ఘనంగా ప్రారంభించారు.పోలీసు మీడియా మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు జరుగుతున్న ఈ టోర్నమెంట్ జూన్ 9 నుంచి 11 వరకు మూడు రోజులపాటు నిర్వహించనుంది.

సీఏఆర్ హెడ్క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, అదనపు డీసీపీ షమీర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.మొదటి రోజు ఫలితాలు మల్కాజిగిరి మీడియా థండర్స్ కెప్టెన్ వంశీ,క్రైమ్ పార్ట్నర్స్ను ఓడించింది.జెస్తాది రాజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందగా, ఎస్సీఎస్సీ డిఫెండర్స్ కెప్టెన్ ప్రణవ్ శేరిలింగంపల్లి జట్టు కెప్టెన్ ఖాదిర్ ను ఓడించింది.

శివ కుమార్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇటువంటి క్రీడా పోటీలు పోలీసు, మీడియా మధ్య పరస్పర అవగాహన, సమన్వయం, స్నేహాన్ని మరింత బలపరుస్తాయని తెలిపారు. ‘యునైటెడ్ ఇన్ స్పిరిట్ స్ట్రాంగర్ టుగెదర్ నినాదంతో ఈ టోర్నమెంట్ జరుగుతోంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 11న సాయంత్రం జరగనున్నట్లు పేర్కొన్నారు.