15 August, 2026 | 1:52 AM

డి-మార్ట్ సిబ్బందికి సైబర్ రక్షణ శిక్షణ

15-08-2026 12:00 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 14 (విజయక్రాంతి): మియాపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ‘సురక్షా కా తిరంగా’ అవగాహన ప్రచారంలో భాగంగా గురువారం డి-మార్ట్ సూపర్మార్కెట్లో సైబర్ నేరాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

ఆన్లైన్ ఆర్థిక మోసాలు, యూపీఐ-క్యూఆర్ కోడ్ మోసాలు, ఫిషింగ్ లింకులు, ఏపీకే-కేవైసీ మోసాలు, పెట్టుబడి-ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ కస్టమర్ కేర్, ఉద్యోగ-రుణ మోసాలు, సైబర్ బెదిరింపులు, స్టాకింగ్, సెక్స్టార్షన్, సోషల్ మీడియా-వాట్సాప్ మోసాలు, గుర్తింపు దొంగతనం వంటి అంశాలపై పోలీసులు వివరంగా వివరించారు.