బాధ్యతాయుతంగా పనిచేయాలి
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
ఎమ్మెల్యేను కలిసిన ఎస్సీ సెల్ నేతలు, ప్రజాప్రతినిధులు
సికింద్రాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): సికింద్రాబాద్ జిల్లా, కంటోన్మెంట్ నియోజకవర్గానికి నూతనంగా ఎంపికైన జిల్లా, నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు, ప్రతినిధులు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులందరికీ ఎమ్మెల్యే గణేష్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
పార్టీ బలోపేతానికి ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని, జిల్లాలో నియోజకవర్గంలో ఎస్సీ వర్గాల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో నూతనంగా ఎంపికైన సికింద్రాబాద్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ శ్యామ్ సుందర్, వైస్ చైర్మన్ జి. వివేక్, జనరల్ సెక్రటరీలు గజ్వేల్ భరత్, వెంకటేష్, సుందర్ రాజన్, సెక్రటరీలు ఏ. జోషువా, ఏ. జీవన్ తదితరులున్నారు. అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గ ఎస్సీ సెల్‌కు నూతనంగా ఎంకైన ఎస్సీ సెల్ చైర్మన్ నాగులపల్లి మల్లేష్, వైస్ చైర్మన్ బాబూరావు, 8 వార్డుల సభ్యులు శరత్ బాబు (వార్డు 1), కొండూరి యాదగిరి (వార్డు 2), లింగని ఉత్తరయ్య (వార్డు 3), బోజ మహేష్ (వార్డు 4), బట్టు భిక్షపతి (వార్డు 5), అడపం అవినాష్ (వార్డు 6), డి. రాకేష్ (వార్డు 7), నవీన్ (వార్డు 8) మోండా డివిజన్ నుంచి రాపర్తి శివకుమార్ ఎమ్మెల్యేను కలిసారు.






