2 June, 2026 | 1:56 AM

బండి సంజయ్ క్షేమం కోరుతూ సైకిల్ యాత్ర

02-06-2026 01:08 AM

కార్యక్రమం చేపట్టిన తిరుపతివాసి పెరుగు వెంకటేశ్వర్లు

కరీంనగర్, జూన్1(విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రల నుంచి కాపాడటంతోపాటు ఆయనకు మానసిక ప్రశాంతత కల్పిం చాలని కోరుతూ తిరుపతికి చెందిన 46 ఏళ్ల జాతీయవాది పెరుగు వెంకటేశ్వర్లు సైకిల్ యాత్ర చేపట్టారు. తిరుపతి అలిపిరి వద్ద గంగమ్మకు మొక్కులు చెల్లించుకుని ‘శక్తి సం కల్ప యాత్ర’ పేరుతో గత నెల 25న సైకిల్ యాత్ర ప్రారంభించారు.

తిరుపతి మీదుగా మొదలైన సైకిల్ యాత్ర ఒంటిమిట్ట, కడప, నంద్యాల, మైదుకూరు, కర్నూలు మీదుగా తెలంగాణలో అడుగుపెట్టారు. అలంపూర్ మీదుగా పెబ్బేరు, జడ్చర్ల, బాలానగర్, షాద్ నగర్, శంషాబాద్ మీదుగా ఆయన సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రతిరో జు సగటున 85 కి.మీల చొప్పున సైకిల్ తొక్కుకుంటూ భాగ్యనగరానికి చేరుకున్నా రు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ హైదరాబాద్‌లోనే ఉన్నారని తెలియడంతో వెంకటేశ్వర్లు నేరుగా ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సైకిల్‌యాత్ర చేపట్టిన పెరుగు వెంకటేశ్వర్లును అభినందించారు.