13 July, 2026 | 10:44 AM

డాబర్ ఇండియా నికర లాభం 16% వృద్ధి

03-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 2: ఎఫ్‌ఎంసీజీ కంపె నీ డాబర్ ఇండియా నికరలాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 16 శాతం వృద్ధితో రూ.301 కోట్ల నుంచి రూ.350 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం 5 శాతం పెరిగి రూ.2,815 కోట్లుగా నమోదయ్యింది. షేరుకు రూ.2.75 చొప్పున తుది డివిడెండు ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫార్సుచేసింది. తాజాగా ముగిసిన త్రైమాసికం లో డాబర్ ఇబిటా 14 శాతం పెరిగి రూ.410 కోట్ల నుంచి రూ.467 కోట్ల కు చేరింద. మార్జిన్లు 16.6 శాతానికి మెరుగుపడ్డాయి. కంపెనీ టూత్‌పేస్ట్ వ్యాపారం 23 శాతం పెరగ్గా, హాజ్‌మోలా అమ్మకాలు జోరుగా పెరగ డంతో డాబర్ డైజెస్టివ్ వ్యాపారం 16 శాతం వృద్ధిచెందింది. మస్కిటో రిపెల్లెంట్స్ నేతృత్వంలో హామ్‌కేర్ వ్యాపా రం 7.6 శాతం పెరిగినట్టు డాబర్ ఇండియా వివరించింది. నాల్గవ త్రైమాసికంలో తమ అంతర్జాతీయ వ్యాపారం కూడా 12 శాతం వృద్ధిచెందిందని, ఈజిప్టు, టర్కీ, మధ్యప్రాచ్య, ఉత్తర అమెరికా మార్కెట్లు వృద్ధికి దోహదపడ్డాయని  తెలిపింది.