calender_icon.png 20 December, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంత ప్రేమించానో అంతే ద్వేషించా!

19-12-2025 12:00:00 AM

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఓ క్రేజీ చిత్రంతో వస్తున్నారు. ‘ఎస్‌వీసీ59’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఈ నెల 22న రిలీజ్ చేయనున్నారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో హీరో పాత్రను పరిచయం చేశారు డైరెక్టర్ రవికిరణ్. ‘ఒక మనిషి గురించి ఎప్పటినుంచో ఈ కథ చెప్పాల నుకుంటున్నా, నా జ్ఞాపకాల్లో అతను ఉన్నాడు, చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తూ పెరిగా, అతన్ని ఎంత ప్రేమించానో అంతే ద్వేషించాను. మీకు కూడా అతన్ని పరిచయం చేస్తాను..’ అంటూ సాగుతోందీ నోట్ ప్రోమో.