calender_icon.png 15 June, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాన్నా.. ఉద్యోగం మానేసి నిన్ను చూసుకుంటా!

14-06-2025 01:08:24 AM

- పైలట్ సుమిత్ సభర్వాల్ చివరి మాటలు

న్యూఢిల్లీ, జూన్ 13: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంతో వందల మంది కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిలింది. అప్పటివరకు తమవారితో సంతోషంగా ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు క్షణాల్లో కాలిబూడిదైన వార్తవిని చాలా మంది  దిగ్భ్రాంతి గురయ్యారు.

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఫ్లుటై కెప్టెన్ సుమిత్ సబర్వాల్ చివరి మాటలు ఆసక్తి రేపుతున్నాయి.  కెప్టెన్ సుమిత్‌కు 8,200 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉన్నట్టు  డీజీసీఏ తెలిపింది. అయితే కెప్టెన్ సు మిత్ సభర్వాల్ తండ్రి వయోభారంతో బాధపడుతుండటంతో సుమిత్ ఉద్యో గం మానేసి.. ఒంటరిగా ఉన్న తన త ండ్రిని చూసుకోవాలని అనుకున్నట్టు స న్నిహితవర్గాలు పేర్కొన్నాయి. ముంబైలోని పో వై ప్రాంతంలో అతడి తండ్రి ఒ ంటరిగా ఉంటున్నారు.

గతంలో ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో పనిచేసి, పదవీ విరమణ పొ ందారు. ఇటీవల ఆయన వద్దకు వెళ్లిన సుమిత్ ‘త్వరలో ఉద్యోగం మానేసి ని న్ను చూసుకుంటా నాన్నా’ అని తన త డ్రికి మాటిచ్చారని.. ఇంతలోనే ఘోరం జరిగిందని సన్నిహితులు వాపోయారు. కాగా సుమిత్ తండ్రిని పలువురు రాజకీయ నాయకులు ఓదార్చారు.