17 April, 2026 | 10:12 AM

విమాన ప్రమాదంలో వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రత

14-06-2025 01:05 AM

- అచ్చు అణుబాంబు పేలినంత తీవ్రత

- సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం

అహ్మదాబాద్, జూన్ 13: అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనేకమంది జీవితాల్లో విషాదం నింపింది. ప్రమాద సమయంలో తారాస్థాయిలో ఉష్ణోగ్రతలు వెలువడినట్టు తెలుస్తోంది. విమా నం కూలిన సమయంలో దాదాపు వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్టు అధికారులు వెల్లడించారు.

దీంతో సహాయక చర్యలు చేప ట్టడం అత్యంత కఠినంగా మారిందని పే ర్కొన్నారు. ప్రమాదానికి గురైన విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉం దని, మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఎవరినీ కాపాడలేకపోయామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం వెల్లడించిన విషయం తెలిసిందే. ఘటనపై ఓ ఎస్‌డీఆర్‌ఎఫ్ అధికారి స్పందిస్తూ.. ‘గతంలో మేం ఎన్నో సహాయక చర్యలు చేపట్టాం. కానీ, ఇలాంటి విపత్తును ఇంతకముందెప్పుడూ చూడలేదు.

విమానం లోని ఇంధన ట్యాంక్ పేలిపోవడంతో అగ్నిగోళం ఏర్పడింది. సెకన్ల వ్యవధిలోనే అక్కడి ఉష్ణోగ్రతలు వెయ్యి డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. దీంతో ప్రమాదం నుం చి ఎవరు బయటపడే అవకాశం లేకుం డా పోయింది. మేం పీపీఈ కిట్లు వేసుకొని ఘటనాస్థలానికి చేరుకున్నా.. వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది’ అని పేర్కొన్నారు.