calender_icon.png 26 December, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వామి ఆలయానికి దైద ఆర్థిక సహాయం

26-12-2025 03:35:15 PM

నకిరేకల్,(విజయ క్రాంతి): నకిరేకల్ పట్టణ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ హరి హరపుత్ర అయ్యప్ప స్వామిదేవాలయం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 34వ మండల పూజ, స్వామివారి అభిషేక పూజ మహోత్సవంలో తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి రూ.10,116 ఆర్థిక సహాయాన్ని దేవాలయ నిర్వాహకులకు అందజేశారు. స్వామివారి విశిష్టత, భక్తి మార్గం, ఆధ్యాత్మికత అయ్యప్ప స్వామి బోధనలు సమాజంలో ఐక్యత, క్రమశిక్షణ,సేవాభావాన్నిపెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు  పాల్గొన్నారు.