calender_icon.png 26 December, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

28న గ్రామాల్లో ఆందోళనలు

26-12-2025 03:30:44 PM

హైదరాబాద్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ(Mahatma Gandhi) పేరు తొలగించడంపై నిరసనలకు కాంగ్రెస్(Congress) పిలుపునిచ్చింది. ఈనెల 28న గాంధీ చిత్రపటాలతో గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని నీరు కార్చేందుకు బీజేపీ(Bharatiya Janata Party) కుట్ర చేస్తుందని ఆరోపించారు. నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.