వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం
స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
స్వామివారి నిత్య ఆదాయం 11,58,891/-
యాదగిరిగుట్ట, జులై 29 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో బుదవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూవులకు అర్చన, అభిషేకం, ప్రాకారమంటపంలో నృసింహ హోమం, నిత్య కళ్యాణంను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవ స్వామివారు తిరువీధులలో ఊరేగారు. కొండపైన అనుబంధ ఆలయం అయినా శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో ప్రతినిత్యం స్పటిక లింగ దర్శనని ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్వామి వారి దర్శనానంతరం బంగారు వాకిలిలో వైటీడీ ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వేద మండపం లో వేదాశీర్వచనం చేసిన వేదపండితులు, శ్రీ స్వామి వారి ప్రతిమ,లడ్డు ప్రసాదం అందజేసిన ఆలయ ఈఓ భవాని శంకర్. ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్,జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు,రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. స్వామివారి నిత్య రాబడి 11,58,891/-.






