సీయూఈటీ పీజీలో ప్రతిభ..
ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (తెలుగు) సీటు సాధించిన గొర్రె చైతన్య
ఆగస్టు తొలి వారంలో కౌన్సెలింగ్..
నాగిరెడ్డిపేట్ మండలానికి చెందిన విద్యార్థి ఘనత
నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-PG)లో ప్రతిభ కనబరిచిన నాగిరెడ్డిపేట్ మండలం మాసంపల్లి గ్రామానికి చెందిన గొర్రె చైతన్య ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (తెలుగు) పీజీ కోర్సులో ప్రవేశానికి సీటు సాధించారు.జాతీయ స్థాయిలో నిర్వహించిన సీయూఈటీ పీజీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన చైతన్యకు ఆగస్టు తొలి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ అనంతరం ప్రవేశ ప్రక్రియ పూర్తి కానుంది.ప్రతిష్ఠాత్మక కేంద్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి సీటు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ చైతన్యకు అభినందనలు తెలిపారు.ఆమె ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.






