19-01-2026 07:33:28 PM
వెంకటాపూర్,(విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటపూర్ మండలంలోని ప్రపంచ ప్రఖ్యాత గాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సీఎం అధికారిక కార్యక్రమాల వ్యాఖ్యాత దక్షిణమూర్తి కుటుంబ సభ్యులతో సహా సోమవారం దర్శించుకున్నారు. సోమవారాల్లో మేడారంలో సీఎం కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తిరుగు ప్రయాణంలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయం పూజారి కోమల్ల హరీష్ శర్మ వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారి శేష వస్త్రాలతో దక్షిణామూర్తిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ గిరిబాబు, జిపిఓ సూరయ్య, రామప్ప జర్నలిస్టు సొసైటీ అధ్యక్షుడు భేటీ సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.