19-01-2026 07:36:43 PM
విజయ క్రాంతి పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ: పత్రికలు ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. కోదాడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో విజయ క్రాంతి దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజా చైతన్యంలో పత్రికలదే అగ్రస్థానం అన్నారు. ఆ కోవలో విజయక్రాంతి దినపత్రిక చేస్తున్న కృషిని అభినందించారు.
నూతన ఒరవడి సృష్టిస్తూ వినూత్న రీతిలో పాఠకులకు అర్థమయ్యే విధంగా, కథనాలను అందిస్తూ ప్రజా మన్ననలు పొందుతున్న న పత్రిక భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలనీ అన్నారు. నికార్సయిన వార్తలను, నిష్పక్షపాతంగా అందిస్తున్న నినాదం పత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, మాజీ సర్పంచ్ ఎర్నేని కుసుమ బాబు, దేవరం మల్లేశ్వరి, లక్ష్మణరావు, కొల్లా కోటిరెడ్డి, బాజాన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.