22-08-2025 02:33:25 AM
ఎల్బీనగర్, ఆగస్టు 21(విజయక్రాంతి): మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అగ్రనేత చలపతి భార్య కాకరాల సునీత, ఏసీఎం సభ్యుడు హరీశ్‌తో కలిసి గురువారం పోలీసులకు లొంగిపోయారు. ఎల్బీనగర్‌లోని రాచకొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాచ కొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు లొం గిపోయిన మావోయిస్టుల వివరాలను వివరించారు.
లొంగిపోయిన వారిలో స్టేట్ కమి టీ మెంబర్ కాకరాల సునీత అలియాస్ బ ద్రి, ఏరియా కమిటీ మెంబర్ హరీశ్ ఉన్నా రు. సునీత పార్టీ సిద్ధాంతకర్తగా, పార్టీ మూలస్థంభంగా పనిచేశారు. ఏరియా కమిటీ స భ్యుడిగా హరీశ్ పనిచేశారు. సునీత చెల్లెలు మావోయిస్టు సీనియర్ నాయకురాలు మా ధవి కూడా మావోయిస్టు పార్టీలో ఉన్నారని, ఆమె కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని సీపీ కోరారు. ఇప్పటివరకు 3,87మంది జనజీవన స్ర వంతిలో కలిసినట్లు చెప్పారు. లొంగిపోయినవారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తున్న దని తెలిపారు.
మావోయిస్టు సిద్ధాంతకర్తగా సునీత
కాకరాల సునీత(62) అలియాస్ బద్రి అలియాస్ లక్ష్మిఅలియాస్ సరోజ అలియా స్ శారద రాజమండ్రిలో 1985లో ఇంటర్ చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌యూ పట్ల ఆకర్షితురాలైంది. ఆమె తండ్రి కాకరాల సత్య నారాయణ విప్లవ రచయితల సంఘంలో ముఖ్యమైన నాయకుడు. ఇతను సినీనటుడి గా పలు చిత్రాల్లో నటించారు. వరవరరావు, గద్దర్ తదితర విప్లవకారులు తరచుగా వీరి ఇంటికి వస్తుండడంతో పార్టీ పట్ల ఆమె ఆకర్షణకు దోహదపడింది.
జనవరి 1986లో సునీత పీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమెకు టీఎ ల్‌ఎన్ చలం అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్‌తో పరిచయం ఏర్పడి ఆగస్టు 198 6లో వివాహం చేసుకున్నారు. సునీత 19 90 నుంచి ఇప్పటివరకు వివిధ హోదాల్లో పనిచేశారు.
కార్యకర్తల్లో సైద్ధాంతిక, రాజకీ య అవగాహన కల్పించడానికి సునీత, చలం విద్యావేత్తలుగా పనిచేశారు. కాగా ఈ ఏడాది జూలై 5న అన్నపురం నేషనల్ పార్క్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చలం చనిపోయాడు. సునీత మొత్తం ఐదు ఎన్‌కౌంటర్ల లో పాల్గొన్నారు. సునీతకు ఆమెపై ఉన్న రూ. 25 లక్షల రివార్డ్‌ను అందజేశారు.
పదో తరగతి చదువుతున్నప్పుడే..
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన చెన్నూరి హరీశ్ అలియాస్ రామన్న అలియాస్ శ్రీను ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. 2006లో ఏటూరునాగారంలోని బీసీ వెల్ఫే ర్ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్నప్పు డు మావోయిస్టు పార్టీకి ఆకర్షితుయ్యా డు. 2017లో మావోయిస్టు పార్టీలో చేరాడు. 2018లో భద్రాచలంలో అరెస్టయి నెల రో జులు వరంగల్ జైలులో ఉన్నాడు.
విడుద లైన అనంతరం దామోదర్ అలియాస్ బడే చొక్కారావు, మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ బృందంలో పనిచేశారు. 2022లో టెకమెట్టా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో హరీ శ్ కుడి కాలుకు బుల్లెట్ గాయం అయింది. మే 2024లో ఏరియా కమిటీ సభ్యుడిగా (ఏసీఎమ్) పదోన్నతి లభించింది. ఈ ఏడా ది జూలై 7న నేషనల్ పార్క్ ప్రాంతంలోని ఇర్పగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో పా ల్గొన్నాడు. సమావేశంలో రాచకొండ పోలీ సు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.