1 May, 2026 | 5:16 PM

సీపీఐ నేత రత్నం ఐలయ్య కు దళిత రత్న అవార్డు

01-05-2026 04:02 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): సీపీఐ సీనియర్ నేత, ఎం ఆర్ పీ ఎస్ నాయకుడు రత్నం ఐలయ్య దళిత రత్న అవార్డు దక్కింది. చిరకాలంగా రత్నం ఐలయ్య చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆయనకు దళిత రత్న అవార్డు తో గౌరవించింది. ఈ మేరకు మహనీయుల జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్రభారతిలో దళిత రత్న అవార్డుల ప్రధాన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

అందులో భాగంగా బెల్లంపల్లి పట్టణం టేకుల బస్తీకి చెందిన రత్నం ఐలయ్య ను తొలుత శాలువాతో సత్కరించారు. మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్, ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్, వైస్ చైర్మన్ మేతరి రోజా రాణి మాదిగ, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు పెరుమాండ్ల డాక్టర్ రామకృష్ణ మాదిగ రాష్ట్ర దళిత రత్న అవార్డు అందజేశారు. దళిత రత్న అవార్డు అందుకోవడం పట్ల అవార్డు గ్రహీత రత్నం ఐలయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.