1 May, 2026 | 5:14 PM

చికాగో అమరవీరుల స్ఫూర్తితో పోరాడుదాం

01-05-2026 04:01 PM

కందగట్ల సురేందర్ పిలుపు

కొత్తగూడెం, (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ సెంటర్ లో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన 140వ మేడే కార్యక్రమానికి సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్ హాజరై మేడే జెండాను ఎగురవేశారు.

అనంతరం జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి సురేందర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ కార్మిక, శ్రామికుల హక్కుల దినం కార్మికుల నెత్తుటి రక్తంతో సాధించిన రోజు మేడే అని, రోజు 16 గంటలు పనిచేస్తున్న నాటి శ్రామిక వర్గాన్ని విముక్తి చేసి ఎనిమిది గంటల పని కల్పించిన గొప్ప రోజు మేడే అని, ఈ పవిత్రమైన మేడే సందర్భంగా శ్రామిక కార్మిక, కర్శక వర్గాలు మరింతగా పోరాడి మరిన్ని హక్కులను సాధించాలని పిలుపునిచ్చారు. 1986లో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులకు ఎనిమిది గంటల పని కోసం జరిగిన హే మార్కెట్  ఘటన పోలీస్ కాల్పులకు దారితీసిందని, దీని పునాదిగా శ్రమ దోపిడీ వ్యతిరేకంగా కార్మికులు చేసిన త్యాగానికి ఇది ప్రతీక నాడు పరిశ్రమలలో కార్మికుల రోజుకు 16 నుంచి 18 గంటలు పని చేసేవారు దీని వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని కోసం 8 గంటల విశ్రాంతి కోసం జరిగిన పోరాటమే 

ఈ మేడే, మేడే రోజున చికాగో నగరంలో నాటి పోలీస్ కాల్పులలో ప్రాణాలు కోల్పోయిన కార్మిక అమరవీరుల త్యాగం వల్లనే ఈ రోజు ప్రపంచ కార్మికులకు ఎనిమిది గంటల పని దినం అనేది సాధించడం జరిగిందని అన్నారు. మే ఒకటి 1986 న అమెరికా వ్యాప్తంగా సమ్మెలు జరిగాయని, 1989 పారిస్ లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశంలో 1986 చికాగో సమ్మెను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా మేడే రోజు అమరులైన కార్మికుల అమరత్వాన్ని, త్యాగనిరతిని ఎత్తిపడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ ఏటా మే 1న కార్మిక దినోత్సవం జరుపుకోవాలని, 1989 లో ప్యారిస్ లోని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని అన్నారు.

అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం మే 1న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రామిక కార్మిక వర్గం మే డే స్ఫూర్తితో ఘనంగా జెండాలు ఎగిరేసికుంటుదని అన్నారు. పోరాడుతున్న కార్మికులకు మేడే ఒక స్ఫూర్తిదాయక పోరాటమని, అది అమరుల త్యాగాలకు మహోన్నతమైన ప్రతికని, ఆ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ నాయకులు ఎస్కే గౌస్ పాషా, తేజావత్ వీరన్న, సంగటి సాయిలు, ఈసాల సీతారాములు, పునుగుల వీరన్న, వాంకుడోత్ లక్ష్మి, వీరమల్లు, చిర్రా కృష్ణ, వాసంశెట్టి బుచ్చి రాములు, యలమంచి వెంకన్న, శ్రీనివాసరావు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.