9 April, 2026 | 3:44 PM

దళిత ద్రోహి కడియం శ్రీహరి

07-05-2024 01:49 AM

బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్

జనగామ, మే 6 (విజయక్రాంతి): దళిత ద్రోహి కడియం శ్రీహరి అని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ విమర్శించారు. రాజకీయాల్లో దళితులు ఎదగకుండా అణగదొక్కిన నీచ చరిత్ర ఆయనదని మండిపడ్డారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండలో, రఘునాథపల్లిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో అరూరి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను, తనను కడియం రాజకీయంగా అణిచివేశారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనుడు కడియం అని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి మోసపూరిత మాటలతో తెలంగాణ ప్రజలు ఒకసారి మోసపోయారని, మరోసారి ఎంపీ ఎలక్షన్లలో మోసపోవద్దని కోరారు. మోదీ హయాంలో దేశం రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. భారతదేశం సుస్థిర అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.